rishab pant: సంజు శామ్సన్ రిటైర్మెంట్ తీసుకుని.. ఇంగ్లండ్/ఆస్ట్రేలియాకు ఆడాలంటూ అభిమాని సూచన

  • ఇంగ్లండ్ తో మొదటి టీ20కి శామ్సన్ ఎంపిక
  • కోహ్లీ, పంత్ అందుబాటులో లేకపోవడం వల్లే
  • ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్న అభిమానులు
48 match failure Rishabh Pant playing Sanju Samson should retire

సంజూ శామ్సన్ పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న వైఖరిపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. సామాజిక మాధ్యమాలపై తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ తో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఆశ్చర్యకరంగా మొదటి మ్యాచ్ కు సంజు శామ్సన్ ను ఎంపిక చేసిన బీసీసీఐ తర్వాతి రెండు మ్యాచులకు అవకాశం ఇవ్వలేదు. మొదటి టీ20కి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతోనే శామ్సన్ కు అవకాశం వచ్చి ఉంటుందని, అతడి ప్రతిభను చూసి కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఐర్లాండ్ తో మ్యాచ్ లో శామ్సన్ 77 పరుగులు సాధించిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ లోకి కూడా శామ్సన్ ను తీసుకోలేదు. ఆ తర్వాత మాత్రం స్వదేశంలో శ్రీలంక, వెస్టిండీస్ తో సిరీస్ లకు అవకాశం ఇచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ కు పరిగణనలోకి తీసుకోలేదు. 

డబ్లిన్ లో ఐర్లాండ్ తో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల్లోనూ శామ్సన్ కు ఒక దాంట్లోనే అవకాశం ఇచ్చారు. శామ్సన్ కేవలం 42 బంతులను ఆడి 77పరుగులు చేయడం పట్ల అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా బీసీసీఐ చిన్న చూపు చూస్తుండడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఓపెనర్ గైక్వాడ్ కు గాయం కావడంతో శామ్సన్ కు అవకాశం లభించింది. 

‘‘సంజూ శామ్సన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సంజూ శామ్సన్ అభిమానులను బీసీసీఐ నిరాశపరింది. వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని వినియోగించుని 77 పరుగులు చేశాడు. కానీ, 48 మ్యాచుల్లో విఫలైమన రిషబ్ పంత్ అతడికి బదులు ఆడుతున్నాడు’’ అంటూ అనురాగ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.  

‘‘సంజు శామ్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. అప్పుడు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా తరఫున ఆడొచ్చు’’ అని మరో అభిమాని సూచించాడు. ‘‘దక్షిణాది సినిమాలకు ప్రతి ఒక్కరూ అభిమానే. అలాగే, సంజూ శామ్సన్ కూడా దక్షిణాదికి చెందినవాడే. బాలీవుడ్ బంధుప్రీతి భారత క్రికెట్ లో తారస్థాయికి చేరింది. ముందుకు వచ్చి అతడికి మద్దతుగా నిలవాలి’’ అంటూ విషాల్ అనే మరో యూజర్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News