Jaspreet Bumrah: ఇంగ్లండ్ తో టెస్టుకు టీమిండియా కెప్టెన్ గా బుమ్రా... పంత్ కు వైస్ కెప్టెన్సీ

Bumrah appointed as Team India captain against England
  • రేపు బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • ఈ ఉదయం టీమిండియాకు కరోనా టెస్టులు
  • రోహిత్ శర్మకు పాజిటివ్
రేపటి (జులై 1) నుంచి ఇంగ్లండ్ తో జరిగే టెస్టులో టీమిండియాకు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవల లీసెస్టర్ షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కరోనా బారినపడిన రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దాంతో, సెలెక్టర్లు బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

కాగా, రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం లభించడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని బుమ్రా తెలిపాడు. ఈ ఉదయం జట్టు సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారని, ఇవాళ కూడా రోహిత్ శర్మకు పాజిటివ్ వచ్చిందని వెల్లడించాడు. దాంతో, కెప్టెన్సీ చేపట్టాలంటూ తనకు సమాచారం అందిందని బుమ్రా వివరించాడు.
Jaspreet Bumrah
Captain
Team India
England
Rohit Sharma

More Telugu News