Eknath Shinde: సీఎం పదవి ఖాయం చేసుకుని రెబెల్స్ కు వీడియో కాల్ చేసిన షిండే... సంబరాలు చేసుకున్న రెబెల్స్!

Eknath Shinde make a video call to rebels after finalized CM post
  • మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టు
  • సీఎం పదవి దక్కించుకున్న ఏక్ నాథ్ షిండే
  • గోవాలో సంబరాలు చేసుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు
అనూహ్య రీతిలో మహారాష్ట్ర సీఎం పదవి దక్కించుకున్న శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే జాతీయస్థాయిలో మరోసారి చర్చనీయాంశం అయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి గవర్నర్ ను కలిసిన అనంతరం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలకు వీడియో కాల్ చేశారు. గోవాలో ఉన్న రెబెల్స్ కు వీడియో కాల్ ద్వారా తాజా పరిణామాలు వివరించారు. తాను సీఎం అంటూ వెల్లడించారు. 

దాంతో, రెబెల్ ఎమ్మెల్యేల ముఖాలు వెలిగిపోయాయి. వీడియో కాల్ లో షిండేను చూస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు. చేతులు ఊపుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. "ఏక్ నాథ్ షిండే... మీకు ఎదురులేదు... మేమంతా మీ వెంటే ఉంటాం" అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు కూడా రెబెల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేనే మహారాష్ట్ర సీఎం అన్న వార్తలను భారీ టీవీ తెరపై చూస్తూ డ్యాన్సులు చేశారు.
Eknath Shinde
Video Call
Rebels
Chief Minister
Maharashtra

More Telugu News