Pranitha Subhash: "హిందువుల ప్రాణాలు కూడా విలువైనవే"... ప్లకార్డు ప్రదర్శించిన నటి ప్రణీత

Pranitha displays placard on Jaipur incident
  • ఉదయ్ పూర్ లో టైలర్ దారుణ హత్య
  • గొంతుకోసి చంపిన కిరాతకులు
  • నుపుర్ శర్మకు మద్దతిచ్చాడంటూ ప్రతీకార హత్య
  • దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు పలికాడంటూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను దారుణంగా వధించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి కన్హయ్యలాల్ గొంతు కోస్తుండగా, మరో వ్యక్తి వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో భయానక వాతావరణాన్ని సృష్టించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. 

తాజాగా, ఈ ఘటనపై ప్రముఖ హీరోయిన్ ప్రణీత స్పందించారు. హిందువుల ప్రాణాలు కూడా విలువైనవే అంటూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. "ఎవరైనా వింటున్నారా?" అంటూ తన ఫొటోకు ఆమె క్యాప్షన్ కూడా పెట్టారు. "ఉదయ్ పూర్ ఘటనకు చెందిన వీడియో చూడకూడదని అనుకున్నాను. కానీ అది చాలా భయానక ఘటన. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే అరుపులు మన మనసుల్లో ప్రతిధ్వనిస్తాయి, చాలాకాలం పాటు మనల్ని వెంటాడతాయి" అని పేర్కొన్నారు.
Pranitha Subhash
Tailor
Murder
Udaypur
Nupur Sharma

More Telugu News