KTR: బెంగళూరులో ట్రాఫిక్.. చెన్నైలో తేమ.. ముంబైలో ఖర్చు.. హైదరాబాదే బెటర్: కేటీఆర్

Traffic in Bengaluru Humidity in Chennai Cost in Mumbai Hyderabad is better says KTR
  • ప్రపంచ టాప్ దిగ్గజ ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రం
  • నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ సదస్సులో ప్రసంగం
  • కొత్త సంస్థల స్థాపనకు ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నట్టు వెల్లడి
దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో మెరుగైనదని.. కొత్త సంస్థల ఏర్పాటుకు అద్భుతమైన కేంద్రమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు. హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో నాస్కామ్ 12వ ఎడిషన్ జీసీసీ సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.  హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.

‘‘బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువ.. చెన్నైలో తేమ ఎక్కువ.. ముంబై విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది.. అక్కడ రాజకీయ పరిస్థితులూ బాగా లేవు కూడా. మౌలిక సదుపాయాలు, వాతావరణం, స్థిరమైన పాలన.. ఇలా అన్ని విషయాల్లో హైదరాబాద్ ఉత్తమం. ఇక్కడ అత్యున్నతమైన బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. పరిశ్రమలకు అనువైన అద్భుత విధానాలను తెలంగాణ అమలు చేస్తోంది. కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి అద్భుతమైన ప్రదేశం. అందుకే ప్రపంచంలోని టాప్‌ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ ను ఎంచుకున్నాయి..” అని కేటీఆర్ పేర్కొన్నారు. 

ఆరు నెలలే రాజకీయాలు..

తెలంగాణలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్నిరకాల అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తాము ఎన్నికల సమయంలో ఒక ఆరు నెలల పాటు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెడతామని.. మిగతా నాలుగున్నరేళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసమే కష్టపడతామని పేర్కొన్నారు.
KTR
Hyderabad
NASCOM
TRS
Telangana

More Telugu News