Aamir Khan: వరద బాధితులకు ఆమిర్ ఖాన్ భారీ సాయం

Aamir Khan donates 25 laks for Assam flood releif works
  • భారీ వరదలతో సతమతమవుతున్న అసోం
  • రూ. 25 లక్షల విరాళం ఇచ్చిన ఆమిర్ ఖాన్
  • వరద బాధితులకు అండగా నిలిచారని సీఎం హేమంత ప్రశంస
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్నో ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 2,389 గ్రామాలు నీటమునిగాయి. మరోవైపు భారీ వరదలతో సతమతమవుతున్న అసోంకు ఎంతో మంది దాతలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను అందిస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తన వంతు సాయం అందించి పెద్ద మనసును చాటుకున్నారు. అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలను అందించారు. ఆమిర్ చేసిన సాయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రశంసించారు. వరద బాధితుల సహాయార్థం రూ. 25 లక్షల విరాళాన్ని అందించి వారికి అండగా నిలిచారని కొనియాడారు. ఆమిర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, కరీనా కపూర్ ముఖ్య పాత్రలను పోషించారు.
Aamir Khan
Bollywood
Assam Floods
Donation

More Telugu News