Veena-Vaani: తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో పాసైన అవిభక్త కవలలు వీణా-వాణి

  • తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడి
  • వీణా-వాణి కుటుంబంలో హర్షం
  • సీఈసీలో వీణకు 712, వాణికి 707 మార్కులు
  • అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్
Veena and Vaani passed Intermediate exams

ఇవాళ తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అవిభక్త కవలలు వీణా-వాణి కూడా ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సీఈసీలో వీణకు 712 మార్కులు రాగా, వాణి 707 మార్కులు సాధించింది. దాంతో, వీణా-వాణిల కుటుంబంలో హర్షం వెల్లివిరుస్తోంది. 

దీనిపై తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వీణా-వాణిలను అభినందించారు. ఇదే రీతిలో ముందంజ వేయాలని శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News