Ram Charan: సల్మాన్ ఖాన్, పూజ హెగ్డేలకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చిన రామ్ చరణ్

Ram Charan hosts Salman Khan and Pooja Hegde
  • 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో నటిస్తున్న సల్మాన్
  • పూజ హెగ్డే కథానాయిక
  • హైదరాబాదులో షూటింగ్
  • సల్మాన్, పూజాలను ఆహ్వానించిన చరణ్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన కొత్త చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలీ' షూటింగ్ కోసం హైదరాబాదులో ఉన్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక. కాగా, టాలీవుడ్ అగ్రనటుడు రామ్ చరణ్... సల్మాన్ ఖాన్, పూజ హెగ్డేలకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. వీరికి విక్టరీ వెంకటేశ్ కూడా జత కలిశాడు. దాంతో, చరణ్ నివాసంలో సందడి నెలకొంది. 

ఈ సందర్భంగా, సల్మాన్, పూజ, వెంకీలకు రామ్ చరణ్, ఉపాసన దంపతులు విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. కొన్నిరోజుల కిందటే సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి ఇంట కూడా ఆతిథ్యం అందుకున్నారు.
Ram Charan
Salman Khan
Pooja Hegde
Hyderabad
Venkatesh

More Telugu News