President Of India Election: మజ్లిస్ మద్దతు యశ్వంత్ సిన్హాకే: అస‌దుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi says majlis legislators will be voting for Yashwant Sinha
  • విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా యశ్వంత్ సిన్హా
  • సోమ‌వారం నామినేష‌న్ వేసిన కేంద్ర మాజీ మంత్రి
  • సిన్హాకే మ‌జ్లిస్ ప్ర‌జా ప్ర‌తినిధులు ఓట్లేస్తార‌న్న అస‌దుద్దీన్‌
భారత రాష్ట్రప‌తి ఎన్నికల్లో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హాకు మ‌రో పార్టీ మ‌ద్ద‌తు ప‌లికింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా సోమవారం య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. సిన్హా నామినేష‌న్ వేసిన రోజున‌నే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ మ‌జ్లిస్ (ఏఐఎంఐఎం) అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

మ‌జ్లిస్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మడి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న య‌శ్వంత్ సిన్హాకే ఓటు వేస్తార‌ని స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో అస‌దుద్దీన్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే య‌శ్వంత్ సిన్హా త‌న‌కు ఫోన్ చేశార‌ని, ఆ సంద‌ర్భంగానే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.
President Of India Election
Yashwant Sinha
AIMIM
Asaduddin Owaisi

More Telugu News