Rain: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

light to moderate rains for three days in telangana
  • ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు
  • కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. 

నైరుతి రుతుపవనాలకు తోడు మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనంతో వానలు పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగం పుంజుకుంటుందని, కొద్ది రోజుల పాటు విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది.
Rain
Telangana
Wether report

More Telugu News