Sun Shine: సముద్రంలోంచి దేవత ఎగిరొస్తున్నట్టుగా..

Sun Look Like a goddess flying out of the sea
  • స్కాట్లాండ్ సముద్ర తీరంలో అద్భుత దృశ్యం
  • వాతావరణ పరిస్థితులతో సూర్యరశ్మి ప్రతిఫలించడమే దీనికి కారణమంటున్న నిపుణులు
బంగారు రంగులో రెక్కలు కట్టుకుని ఎగురుతూ ఎవరో దేవత (ఏంజిల్‌) సముద్రంలోంచి పైకొస్తున్నట్టుగా ఉంది కదూ! సూర్యుడు అస్తమిస్తుండగా సముద్ర జలాల్లో, వాతావరణంలో ప్రతిఫలించిన కాంతి ఇది. మధ్యలో సూర్యుడు తలలా, రెండు వైపులా రెక్కలు, దిగువన సముద్రంలో పొడవుగా ప్రతిఫలించిన కాంతి శరీరంలా.. మొత్తంగా ఓ దేవత అనిపించేలా ఫొటో వచ్చేసింది. 

స్కాట్లాండ్‌ లోని పోర్ట్సోయ్‌ పట్టణంలో ఉన్న బీచ్‌లో స్టూవర్ట్‌ ముర్రే అనే పెద్దాయన తన ఫోన్‌లో ఈ ఫొటో తీశారు. ఆ సమయంలో వాతావరణంలో తేమ, సన్నని నీటి చినుకులు, సముద్రంలో ప్రతిఫలించిన సూర్యకాంతి వంటివన్నీ కలిసి ఇలా ఏంజిల్‌ లాంటి చిత్రం వచ్చి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడీ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరో దేవత సముద్రం లోంచి ఎగురుతూ వస్తున్నట్టుగా ఉందన్న కామెంట్లు వస్తున్నాయి.
Sun Shine
angel
Sun rays like Goddess

More Telugu News