సమంత హవా దేశమంతటా!
- ఒక సర్వేలో ఇండియా మోస్ట్ పాపులర్ నటిగా సమంత
- ఆలియాకు రెండో స్థానం... దీపికకు ఐదో స్థానం
- ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో సమంతకు ఉత్తరాదిలో క్రేజ్
సమంత ఇప్పటిదాకా ఒక్క హిందీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించలేదు. అయినా బాలీవుడ్ లోనూ ఆమెకు ఇంత క్రేజ్ రావడం విశేషం. దక్షిణాది అన్ని భాషల్లో సత్తా చాటుకున్న సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో భాగంలో కీలక పాత్రతో హిందీ జనాలకు చేరువైంది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ‘పుష్ప’సినిమాలో ఊ అంటావా స్పెషల్ సాంగ్ తర్వాత
బాలీవుడ్‌లోనూ సమంత పేరు మార్మోగుతోంది.
ప్రస్తుతం సమంత హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే, మరో హీరోయిన్ తాప్సీ నిర్మించే నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి కూడా ఒకే చెప్పింది. ఈ మధ్య సల్మాన్ ఖాన్ సినిమా కోసం కూడా సమంతను అడిగినట్లు తెలుస్తోంది. సల్మాన్ హీరోగా అనీజ్ బజ్మీ దర్శకత్వంలో ‘నో ఎంట్రీ’ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా సమంత కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సమంత ఒప్పుకుంటే మాత్రం బాలీవుడ్లో ఆమె హవా మరింత పెరగడం ఖాయం.