mumbai: ముంబైలో 144 సెక్షన్ విధింపు

section 144 imposed in Mumbai
  • శివసేనలో ప్రకంపనలు పుట్టిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు
  • రెబెల్స్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
  • ఏక్ నాథ్ షిండే నివాసం వద్ద భద్రత పెంపు
మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసైనికులు రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రెబెల్స్ ఇళ్లు, కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. వారి ఫ్లెక్సీలను చింపేయడంతో పాటు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ నేపథ్యంలో థానేలోని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు. అంతేకాదు, ముంబైలో ఏ క్షణంలోనైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో సెక్షన్ 144 విధించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
mumbai
144 section
Shiv Sena
Maharashtra

More Telugu News