Bhumana Karunakar Reddy: ప్రధాని కార్యాలయం నుంచి నాకు ప్రశంసలు వచ్చాయి: భూమన కరుణాకర్ రెడ్డి

I got appreciations from PMO says Bhumana Karunakar Reddy
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పూర్తిగా ఊడ్చేస్తామన్న కరుణాకర్ రెడ్డి 
  • తిరుమల సమస్యలను జగన్ తీర్చేశారని కితాబు 
  • కరోనా సమయంలో 200 శవాలను ఖననం చేసిన ఘనత తనదని వెల్లడి 
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లోనే చంద్రబాబును ఊడ్చేశామని... వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఊడ్చేస్తామని చెప్పారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న తిరుమల స్థానికుల సమస్యలను సీఎం జగన్ తీర్చేశారని అన్నారు. టీటీడీ ఉద్యోగులకు 3 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ దని చెప్పారు. తిరుపతి అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని తెలిపారు. 

కరోనా సమయంలో 200 శవాలను ఖననం చేసిన ఘనత తనదని భూమన అన్నారు. తాను చేసిన పనికి ప్రధాని కార్యాలయం నుంచి కూడా ప్రశంసలు వచ్చాయని తెలిపారు. కరోనా సమయంలో సీఎం జగన్ చేసిన సేవలకు ఇది గుర్తింపు అని అన్నారు. తిరుపతి టౌన్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Bhumana Karunakar Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News