టమాటా సాస్ తో ఐస్ క్రీమ్.. ఇదెక్కడి దారుణమంటూ నెటిజన్ల ట్రోలింగ్
- కెనడాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్రెంచీస్ కంపెనీ
- కావాలంటే ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చంటూ ప్రచారం
- అటు సాస్.. ఇటు ఐస్ అంటూ ట్విట్టర్లో పెట్టిన సంస్థ
- సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగిన నెటిజన్లు
ఎంత ఎండా కాలమైతే మాత్రం..!
ప్రస్తుతం కెనడాలో ఎండాకాలం కొనసాగుతోంది. ఎండల్లో చల్లదనం అంటూనే ఫ్రెంచీస్ సంస్థ టమాటా సాస్ ఐస్ క్రీమ్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఇదీ లిమిటెడ్ ఎడిషన్ అని.. కెనడా వ్యాప్తంగా కొంతకాలమే అందుబాటులో ఉంటాయనీ ఊరించడం మొదలుపెట్టింది. దీనితో ‘ఎంత ఎండాకాలమైతే మాత్రం.. ఇంత దారుణమా..?’ అంటూ వెక్కిరించడం మొదలైంది. ‘కెచప్ అంటే ఎంతో ఇష్టం కానీ.. ఇలా ఐస్ క్రీమ్ లానూ తినాలా?’ అంటూ కొందరు.. ‘అసలు కెనడాలో ఏం జరుగుతోంది?’, ‘సాస్ అయిపోయింది ఇంకేం తెస్తున్నారు?’.. ఇలా కామెంట్ల మీద కామెంట్లు పడిపోతున్నాయి.