Botsa Satyanarayana: పిల్లలను సక్రమంగా స్కూల్ కి పంపితేనే అమ్మఒడి పథకం వర్తిస్తుంది: బొత్స సత్యనారాయణ

Amma Vodi benefits will be only for regular students says Botsa Satyanarayana
  • లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనే వార్తల్లో నిజం లేదన్న మంత్రి 
  • విద్యార్థుల హాజరు ఆధారంగానే లబ్ధి చేకూరుతుందని వెల్లడి 
  • అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న బొత్స 
అమ్మఒడి పథకం లబ్ధిదారులను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... అబ్ధిదారుల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. పిల్లలను సక్రమంగా స్కూల్ కి పంపితేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు ఆధారంగానే లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అమ్మఒడి డబ్బులలో రెండు వేల రూపాయల కోతను పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. పాఠశాలలు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.
Botsa Satyanarayana
YSRCP
Amma Vodi

More Telugu News