Brad Pitt: నటనకు బ్రాడ్ పిట్ త్వరలో రిటైర్మెంట్

Brad Pitt talks about retirement says I am on my last leg
  • ప్రకటించిన హాలీవుడ్ నటుడు
  • చివరి సెమిస్టర్ లేదా ట్రిమిస్టర్ కావచ్చని వ్యాఖ్య
  • నటనకు సంబంధించి ఇదే చివరి పాదం అన్న పిట్
బాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డుల గ్రహీత బ్రాడ్ పిట్ త్వరలో తాను నటనకు వీడ్కోలు పలకనున్నట్టు ప్రకటించాడు. హాలీవుడ్ అగ్ర శ్రేణి నటుల్లో పిట్ కూడా ఒకడు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలు ఆయన చేశాడు. ఎన్నో సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. సినిమాల నుంచి త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటానని తాజాగా ప్రకటించాడు. పరిశ్రమలో తన నటనకు సంబంధించి  ఇదే చివరి దశగా స్పష్టం చేశాడు. 

ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా బ్రాడ్ పిట్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ’’నాకు తెలిసినంత వరకు నేను చివరి పాదంలో ఉన్నాను. ఇది చివరి సెమిస్టర్ లేదా ట్రిమిస్టర్ కావచ్చు (ఆరు నెలలు లేదా మూడు నెలలు)’’ అని బ్రాడ్ పిట్ పేర్కొన్నాడు. ఇటీవలే ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ సినిమాకు బ్రాడ్ పిట్ ఆస్కార్ అవార్డు అందుకోవడం గమనార్హం. 

మరోవైపు బ్రాడ్ పిట్ తన మాజీ భార్య ఏంజెలినా జోలీతో న్యాయ వివాదాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి భాగస్వామ్యంలో ఉన్న వైన్  వ్యాపారంలో జోలీ తన వాటాలను విక్రయించినందుకు.. బ్రాడ్ పిట్ కోర్టులో పిటిషన్ వేశాడు. అతడు నటించిన బుల్లెట్ ట్రైన్ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది.
Brad Pitt
retirement
annoncement
actor
hollywood

More Telugu News