Nara Lokesh: జగన్ కు అది వ్యసనంగా మారింది: నారా లోకేశ్

Nara Lokesh fires on Jagan
  • జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ అన్న లోకేశ్
  • చంద్రబాబు కృషి వల్ల రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ కంపెనీలు వచ్చాయని వ్యాఖ్య
  • ఏ ఒక్క కంపెనీ కూడా జగన్ తేలేదన్న లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ కు వ్యసనంగా మారిందని ఎద్దేవా చేశారు. మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. 'జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ. ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా జగన్ తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి' అని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News