Chor Bazaar: రేపే 'చోర్ బజార్' విడుదల.. సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు!

  • ఆకాశ్ పూరీ, గెహన సిప్పీ జంటగా 'చోర్ బజార్'
  • 100 కోట్ల విలువైన డైమండ్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమా
  • నిన్న ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్
Akash Puri movie Chor Bazaar releasing on June 24

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం 'చోర్ బజార్' రేపు (జూన్ 24) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఆకాశ్ సరసన గెహన సిప్పీ నటించింది. 'జార్జ్ రెడ్డి', 'దళం' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా... ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 

ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమా కథ అంతా కూడా 100 కోట్ల విలువైన ఒక డైమండ్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ డైమండ్ చోర్ బజార్ కి చేరుతుంది. అక్కడ ఎవరికీ కూడా దాని విలువ తెలియదు. పదికి, పాతికకి దానిని అమ్మడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది ఈ చిత్రం కథ. ఈ సినిమాలో ఆకాశ్ పూరీ పక్కా మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే బిజినెస్ సర్కిల్ లో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

More Telugu News