: హైదరాబాద్ ఐఐటీకి జపాన్ భారీ ఆర్థిక సాయం

జపాన్ ఆర్థిక సాయంతో హైదరాబాద్ ఐఐటీ మరిన్ని శక్తి సామర్థ్యాలను సంతరించుకోనుంది. మొత్తం 1776 కోట్ల రూపాయల సాయంలో కేంద్ర ప్రభుత్వం 15 శాతం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ రుణం రూపంలో అందిస్తుంది. దీనిని 30 ఏళ్ల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో తొలిదశగా 870 కోట్ల రూపాయలు త్వరలోనే అందనున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులతో హైదరాబాద్ లోని ఐఐటీ అన్ని రకాల వసతులను సమకూర్చుకోవడానికి అవకాశం చిక్కుతుంది.

తొమ్మిది భవనాలు, స్పెషల్ టెక్నాలజీ సెంటర్, అకడమిక్ బ్లాకులు, రీసెర్ఛ్ పార్క్, లాబ్ ఎక్విప్ మెంట్ తదితర సదుపాయాలకు జపాన్ నిధులను వినియోగిస్తారు. అలాగే ప్రస్తుతం ఇక్కడ 1000 సీట్లు ఉండగా 2018 నాటికి 7500 సీట్లకు పెంచనున్నారు. అదే సమయంలో టీచర్ల సంఖ్య కూడా 100 నుంచి 750కి పెంచుతారు. దేశంలో ఒక ఐఐటీకి ఇంత భారీ మొత్తంలో ఆర్థిక సాయం రావడం ఇదే మొదటిసారి.

More Telugu News