Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే కరోనా నిబంధనలను అతిక్రమించారని పోలీసులకు ఫిర్యాదు

BJP leader complains on Uddhav Thackeray for violating Covid rules
  • సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఉద్ధవ్ థాకరే
  • వందలాది మందితో భేటీ నిర్వహించారని బీజేపీ నేత ఫిర్యాదు
  • భౌతికదూరం పాటించని సీఎంపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ నేత

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి వైదొలగేందుకు థాకరే సిద్ధమయ్యారు. మరోవైపు నిన్న సీఎం అధికారిక నివాసం 'వర్ష'ను ఆయన ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు ఆయనపై పూలు చల్లారు. మీ వెంట మేమున్నాం అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్ధవ్ థాకరేపై బీజేపీ యువ మోర్చా  జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కరోనా బారిన పడిన ఉద్ధవ్ థాకరే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదులో బగ్గా పేర్కొన్నారు. ఐసొలేషన్ లో ఉండకుండా, భౌతికదూరం పాటించకుండా ప్రజల మధ్యకు వచ్చారని తెలిపారు. అంతేకాదు.. సీఎం అధికారిక నివాసం నుంచి తన నివాసం 'మాతోశ్రీ'కి చేరుకున్న తర్వాత కూడా వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించారని చెప్పారు. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్ధవ్ థాకరే కరోనా బారిన పడినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News