Portal: ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల కోసం 'యువర్ స్క్రీన్స్' పోర్టల్

  • ఏపీలో ఆన్ లైన్ విధానం తీసుకువచ్చిన ప్రభుత్వం
  • తక్కువ ధరలకే టికెట్లు 
  • ప్రభుత్వ లక్ష్యం అదేనన్న ఏపీఎఫ్ డీసీ ఎండీ
  • బ్లాక్ టికెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని వెల్లడి
Portal for onlice cinema ticket sales in AP

ఏపీలో ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు. దీనిపై ఏపీఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. 

యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని వెల్లడించారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయని వివరించారు.

More Telugu News