Maharashtra: సీఎంగా రాజీనామా చేయ‌కుండానే అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్న ఉద్ధ‌వ్ థాక‌రే

  • తిరుగుబావుటా ఎగ‌ర‌వేసిన ఏక్‌నాథ్ షిండే
  • మైనారిటీలో ప‌డిపోయిన థాక‌రే ప్ర‌భుత్వం
  • ఎమ్మెల్యేలు వద్దంటే సీఎం ప‌ద‌వి నుంచి దిగిపోతాన‌న్న ఉద్ధ‌వ్‌
  • అయితే రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌ని శివ‌సేన చీఫ్‌
  • అయినా వ‌ర్ష బంగ్లా నుంచి త‌న సామాగ్రిని త‌ర‌లిస్తున్న థాక‌రే
maharashtra cm uddhav Rhackeray vacating Versha Bungalow

మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం క్ష‌ణానికో మ‌లుపు తీసుకుంటోంది. శివ‌సేన‌కు చెందిన కీల‌క నేత ఏక్‌నాథ్ షిండే పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంతో సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే స‌ర్కారు మైనారిటీలో ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. 

ఈ క్ర‌మంలో బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఉద్ధ‌వ్ థాక‌రే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం ప‌ద‌వి కోసం తానేమీ పోరాటం చేయ‌బోన‌ని... ఎమ్మెల్యేలు తాను సీఎంగా కొన‌సాగ‌కూడ‌ద‌ని భావిస్తే త‌క్ష‌ణ‌మే రాజీనామా చేస్తాన‌ని, రాజీనామా లేఖ‌ను కూడా త‌న వ‌ద్ద సిద్ధంగా ఉంచుకున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

అయితే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లుగా థాక‌రే ప్ర‌క‌టించ‌లేదు. అయితే బుధ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ముంబైలోని మ‌హారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వ‌ర్ష బంగ్లా నుంచి ఆయ‌న త‌న ల‌గేజీని బ‌య‌ట‌కు త‌ర‌లించారు. మాతోశ్రీ పేరిట థాక‌రేకు సొంత నివాసం ఉన్న సంగ‌తి తెలిసిందే. వర్ష బంగ్లా నుంచి త‌న సామాగ్రిని త‌ర‌లించ‌డ‌మంటే సీఎంగా దిగిపోయే దిశ‌గానే థాక‌రే అడుగులు వేస్తున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ మేర‌కు వ‌ర్ష బంగ్లా నుంచి త‌న సామాగ్రిని థాక‌రే త‌ర‌లిస్తున్న వీడియో వైర‌ల్‌గా మారిపోయింది.

More Telugu News