Uddhav Thackeray: నమ్మక ద్రోహానికి గురయ్యాను: ఉద్ధవ్ థాకరే

Iam ready to resign says Uddhav Thackeray
  • సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యాననన్న ఉద్ధవ్ 
  • రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని గవర్నర్ కు చెప్పానని వెల్లడి 
  • అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనని వ్యాఖ్య 

శివసైనికుడు ఎవరైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చని ఉద్ధవ్ థాకరే అన్నారు. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యానని తెలిపారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ కు తెలిపానని అన్నారు. చర్చలకు రావాలని ఏక్ నాథ్ షిండే, రెబెల్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. 

శివసేన పార్టీని నడిపేందుకు తాను పనికిరానని చెపితే తాను తప్పుకుంటానని ఉద్ధవ్ అన్నారు. అధికారం కోసం తాను పాకులాడటం లేదని చెప్పారు. గత 30 ఏళ్లుగా తాము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించామని.. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనను సీఎం బాధ్యతలను తీసుకోవాలని కోరారని తెలిపారు. తనకు కాంగ్రెస్, ఎన్సీపీలు పూర్తిగా సహకరించాయని... ఇప్పుడు ఆ పార్టీలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News