Vaishnavtej: వైష్ణవ్ తేజ్ .. శ్రీలీల కొత్త సినిమా లాంచ్!

Vishnavtej movie update
  • 'ఉప్పెన' సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'అంగరంగ వైభవంగా'
  • ఈ రోజునే సెట్స్ పైకి వెళ్లిన కొత్త సినిమా 
  • సాయితేజ్ క్లాప్ తో షూటింగు మొదలు
హీరోగా వైష్ణవ్ తేజ్ ఒక్కోమెట్టు ఎక్కుతున్నాడు. 'ఉప్పెన' .. ' కొండ పొలం' సినిమాలతో  ప్రేక్షకులను అలరించిన ఆయన, 'అంగరంగ వైభవంగా' సినిమాతో త్వరలో థియేటర్లకు రానున్నాడు. మూడో సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, తన నాల్గో సినిమాను పట్టాలెక్కించాడు. 

తన నాల్గో సినిమాను ఆయన శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరోహీరోయిన్లపై సాయితేజ్ క్లాప్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగు మొదలైంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

ఇక శ్రీలీల విషయానికొస్తే వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉంది. రవితేజ సరసన ఒక సినిమా .. నితిన్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా వైష్ణవ్  తేజ్ 4వ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తానికి శ్రీలీల కెరియర్ దూకుడుమీదే  ఉంది. 
Vaishnavtej
Sreeleela
Srikanth Reddy Movie

More Telugu News