Raghu Rama Krishna Raju: మోదీ పర్యటనకు వెళ్లాలి.. భద్రత కల్పించండి: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raji  asks centre for more security
  • కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని కలిసిన రఘురాజు
  • తన నియోజకవర్గంలో మోదీ పర్యటిస్తున్నారని చెప్పిన ఎంపీ
  • తనకు అవసరమైన భద్రత కల్పించాలని కోరిన వైనం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్రధాని మోదీ వచ్చే నెల 4వ తేదీన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని... ఆ సందర్భంగా తాను వెళ్లాల్సి ఉందని వారికి చెప్పారు. తనకు అవసరమైనంత భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ కు వెళ్లాలనుకుంటే రానివ్వలేదని చెప్పారు. నేర చరిత్ర ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేదని అన్నారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Narendra Modi
BJP

More Telugu News