Team India: కులం, ప్రాంతం ప్రస్తావించిన నెటిజన్​.. 'ఇండియాది ఏ కులం.. పని చూస్కో' అంటూ క్రికెటర్​ విహారి కౌంటర్​​

  • వచ్చే నెలలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 
  • ఇందులో ఆడతావా? లేదా? ఆ ప్రాంతం, ఆ కులంది ఎందుకు ఆడతా అంటవా? అంటూ ఓ వ్యక్తి ట్వీట్
  • నిమిషాల్లోనే స్పందించి.. రిప్లై ఇచ్చిన విహారి
cricketer hanuma vihari strong reply to netizen over caste and territary remarks

కులం, మతం గురించిన ప్రస్తావించిన  ఓ వ్యక్తిపై భారత క్రికెటర్, తెలుగు ఆటగాడు హనుమ విహారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియాది ఏ కులం ... నీ పని చూస్కో అంటూ కౌంటర్ ఇచ్చాడు. విహారి ఇలా ఘాటుగా స్పందించినందుకు బలమైన కారణం ఉంది.

ఆంధ్ర క్రికెట్ సంఘం.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఓ టీ20 క్రికెట్ టోర్నీ నిర్వహించనుంది. జులై 6 నుంచి 17వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ పాల్గొంటున్నాయి. ఈ ఆరు జట్ల పేర్లు, లోగోలను మంగళవారం ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రకటించింది.

జట్ల లోగోలతో కూడిన ఫొటోను ఓ వ్యక్తి ‘పైత్యం’ అనే పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘ఆడతావా లేదా ఆ ప్రాంతం, ఆ కులంది నేనెందుకు ఆడతా అంటావా?’ అని హనుమ విహారిని ట్యాగ్ చేశాడు.  దీనిపై విహారి నిమిషాల్లో స్పందించాడు. ‘ఇండియాది ఏ కులం ...  పని చూస్కో’ అంటూ అతని నోరు మూయించాడు.

More Telugu News