మెగా హీరోతో 'సాహో' డైరెక్టర్!

Sujeeth new movie update
  • 'సాహో'తో సుజీత్ కి పడిన ఫ్లాప్ 
  • ఆ ఎఫెక్ట్ తో దక్కని అవకాశాలు
  • వరుణ్ తేజ్ తో ఓకే అనిపించుకున్న డైరెక్టర్ 
  • మైత్రీ బ్యానర్లో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
సుజీత్ పేరు వినగానే 'సాహో' సినిమా గుర్తుకు వస్తుంది. ప్రభాస్ కథానాయకుడిగా .. యూవీ బ్యానర్లలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైంది. విడుదలకి ముందు ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉండేవి. ఆ కారణంగానే ప్రభాస్ కెరియర్ లోనే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఆ తరువాత మాత్రం కొత్త రికార్డులను సెట్ చేయలేకపోయింది.

'సాహో' ఎఫెక్ట్ సుజీత్ కెరియర్ పై బాగానే పడింది. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన మరో సినిమా చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు మాత్రం వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా  తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. 

ఆల్రెడీ సుజీత్ .. వరుణ్ తేజ్ కి కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. 'గని' ఫ్లాప్ తో ఫీలైన వరుణ్, 'ఎఫ్ 3' సక్సెస్ తో ఆ బాధ నుంచి తేరుకున్నాడు. ఇక సుజీత్ తో ఆయన సినిమా ఏ జోనర్లో ఉంటుందో .. ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
Go Back to Shorts
Varun Tej
Sujeeth
Tollywood

More Telugu News