Arjun: కూతురు ఎంట్రీని అర్జున్ పెద్ద రేంజ్ లోనే ప్లాన్ చేశాడు!

  • యాక్షన్ కింగ్ గా అర్జున్ కి పేరు
  • కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా నిలబెట్టాలనే ఆలోచన 
  • తమిళ .. కన్నడ ఇండస్ట్రీలకి పరిచయం చేసిన అర్జున్
  • విష్వక్సేన్ జోడీగా కనిపించనున్నఐశ్వర్య
Arjun movie update

యాక్షన్ కింగ్ అర్జున్ కి తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు తన కెరియర్ ముగిసింది అనుకున్నప్పుడు, సొంత బ్యానర్లో సినిమా చేసుకుని మళ్లీ ఆయన గాడిలో పడిపోయారు. ఇప్పుడు అదే బ్యానర్లో తన కూతురికి హీరోయిన్ గా నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

అర్జున్ కూతురు ఐశ్వర్య మంచి అందగత్తెనే. తమిళ .. కన్నడ భాషల్లో ఆమెను పెట్టి సొంత బ్యానర్లోనే అర్జున్ సినిమాలు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఆమెకి గుర్తింపు దక్కలేదు. దాంతో తెలుగులో కూడా హీరోయిన్ గా ఐశ్వర్యను పరిచయం చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్ లోనే ఆయన ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. 

విష్వక్సేన్ ను హీరోగా ఎంచుకున్న ఆయన, రచయితగా సాయిమాధవ్ బుర్రాను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా  'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ ను తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎంత బిజీనో .. ఏ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారో తెలియంది కాదు. ఇది అర్జున్ రాసుకున్న కథ .. ఆయనే ఈ సినిమాకి దర్శకుడు కూడా.

More Telugu News