Chinmayi: కవలలకు జన్మనిచ్చిన గాయని చిన్మయి

Singer Chinmayi blessed with twin babies
  • 2014లో వివాహ బంధంతో ఒక్కటైన చిన్మయి-రాహుల్ రవీంద్రన్
  • తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ వచ్చి చేరారన్న రాహుల్
  • శుభాకాంక్షలతో హోరెత్తుతున్న సోషల్ మీడియా
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గత రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చిన్నారుల చేతులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. విషయం తెలిసిన నెటిజన్లు, సెలబ్రిటీలు చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్నారు.

నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు. బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏమాయ చేశావె, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరి వాడేలే నుంచి ఇటీవల విడుదలైన మేజర్ వరకు ఎన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడారు. ఇక ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ హీరోగా, సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. శ్యామ్‌సింగరాయ్ సినిమాలో ఆయన పోషించిన రాహుల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘చి..ల..సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు.
Chinmayi
Rahul Ravindran
Tollywood
Driptah
Sharvas

More Telugu News