Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు... వివరాలు ఇవిగో!

- గత 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు
- 403 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 240 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 145 మంది
- ఇంకా 2,375 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గత కొన్నిరోజులుగా 300కి లోపే నమోదవుతున్న కరోనా కేసులు, తాజాగా 400 దాటాయి. గత 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు నిర్వహించగా, 403 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 240 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,96,704 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,90,218 మంది కోలుకున్నారు. ఇంకా 2,375 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

