Agnipath Scheme: తెలంగాణ పోలీసుల అదుపులోకి ఆవుల సుబ్బారావు... రేప‌టి నుంచి విచార‌ణ షురూ

avula subbarao in telangana police custody
  • సికింద్రాబాద్ అల్ల‌ర్ల నిందితుల‌ను ప్రోత్స‌హించార‌ని సుబ్బారావుపై ఆరోప‌ణ‌లు
  • ఇప్ప‌టికే సాయి డిఫెన్స్ అకాడెమీలో ఐటీ, ఐబీ అధికారుల సోదాలు
  • సోమ‌వార‌మే సుబ్బారావును అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • మంగ‌ళ‌వారం రాత్రి తెలంగాణ పోలీసుల‌కు అప్ప‌గింత‌
  • సుబ్బారావును హైద‌రాబాద్ త‌ర‌లించిన తెలంగాణ పోలీసులు
అగ్నిప‌థ్ ప‌థ‌కంపై నిర‌స‌న‌ల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన విధ్వంసం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు మంగ‌ళ‌వారం రాత్రి తెలంగాణ పోలీసుల అదుపులోకి వెళ్లిపోయారు. ఏపీలోని ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట కేంద్రంగా సాయి డిఫెన్స్ అకాడెమీని నిర్వ‌హిస్తున్న సుబ్బారావు... త‌న వద్ద శిక్ష‌ణ పొందిన అభ్య‌ర్థుల‌ను అల్ల‌ర్ల‌కు ఉసిగొలిపాడని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో సోమ‌వారం న‌ర‌స‌రావుపేట వెళ్లిన ఐటీ, ఐబీ అధికారులు సాయి డిఫెన్స్ అకాడెమీలో సోదాలు చేశారు. అంత‌కుముందే సుబ్బారావును అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ఆయ‌న నుంచి వివ‌రాలు రాబ‌ట్టే య‌త్నం చేశారు. తాజాగా మంగ‌ళ‌వారం రాత్రి తెలంగాణ స‌రిహ‌ద్దు వ‌ద్ద‌కు ఆయ‌న‌ను తీసుకువ‌చ్చిన పోలీసులు సుబ్బారావును తెలంగాణ పోలీసుల‌కు అప్ప‌గించారు. అక్క‌డి నుంచి సుబ్బారావును తెలంగాణ పోలీసులు హైద‌రాబాద్ త‌ర‌లించారు. ఈ కేసులో పూర్తి వివ‌రాలు రాబ‌ట్టే దిశ‌గా సుబ్బారావును తెలంగాణ పోలీసులు విచారించ‌నున్నారు.
Agnipath Scheme
Avula Subbarao
Narasaraopet
Palnadu District
Sai Defence Academy
TS Police
AP Police

More Telugu News