JEE Main: ఈ నెల 23 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు... హాల్ టికెట్ల విడుదల
- జేఈఈ మెయిన్ పరీక్షలకు రంగం సిద్ధం
- ఈ నెల 23 నుంచి 29 వరకు పరీక్షలు
- దేశంలో 501 నగరాల్లో పరీక్షలు
- విదేశాల్లోని 21 నగరాల్లోనూ జేఈఈ
జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో, మొదటి విడత హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దేశంలో 501 నగరాలతో పాటు, విదేశాల్లోని 21 నగరాల్లో జేఈఈ మెయిన్ నిర్వహిస్తుండడం విశేషం. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అన్ని ఏర్పాట్లు చేసింది.
జేఈఈ పరీక్షలపై ఎన్టీయే స్పందిస్తూ... హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అంశంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 011-40759000 ఫోన్ నెంబరులో గానీ, [email protected] మెయిల్ ద్వారా గానీ సంప్రదించాలని సూచించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.