Ram: రేపు సూర్య చేతుల మీదుగా రామ్ సినిమా సాంగు లాంచ్!

  • మాస్ యాక్షన్ మూవీగా 'ది వారియర్'
  • రామ్ జోడీగా అలరించనున్న కృతి శెట్టి
  • సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీ 
  • జులై 14న తెలుగు .. తమిళ భాషల్లో సినిమా రిలీజ్
The Warrior Movie Update

ఈ మధ్య కాలంలో రామ్ మాస్ యాక్షన్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. ఇది మాస్ యాక్షన్ ఎంటర్టయినర్. తన కెరియర్లో రామ్ ఫస్టు టైమ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతకుముందు వదిలిన 'బుల్లెట్' సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరో సాంగును రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు 'విజిల్' అనే సాంగ్ ను సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు.

ఈ సాంగ్ డిజిటల్ రిలీజ్ కి హైదరాబాద్ - ఏఎంబీ సినిమాస్ వేదిక కానుంది. రేపు రాత్రి 7:12 నిమిషాలకు ఈ సాంగ్ ను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను జులై 14వ తేదీన విడుదల చేయనున్నారు..

More Telugu News