Samsung Galaxy: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ విడుదల రేపే

  • గెలాక్సీ ఎఫ్ 13 విడుదల
  • మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో కార్యక్రమం
  • 8జీబీ ర్యామ్ తో రానున్న ఫోన్
  • ధర సుమారు రూ.12,000 స్థాయిలో ఉండొచ్చన్న సమాచారం 
Samsung Galaxy F13 India launch on 22nd june

శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 13 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో దీన్ని నిర్వహించనున్నారు. యూట్యూబ్ ఛానల్, కంపెనీ వెబ్ సైట్లో ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు. ఫ్లిప్ కార్ట్ తోపాటు, శామ్ సంగ్ వెబ్ సైట్ లో  ఈ ఫోన్ విక్రయానికి రానుంది. 

ఎఫ్13 6.6 అంగుళాల పరిమాణంతో ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో, నాచ్ డిజైన్ తో ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ తో రానుంది. ఆటో డేటా స్విచింగ్ సదుపాయంతో వస్తున్న తొలి ఫోన్ ఇది. పింక్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభించనుంది. కంపెనీ అధికారికంగా ఫీచర్ల గురించి ప్రకటించలేదు. కానీ, వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. 

ఎక్సినోస్ 850 ప్రాసెసర్ ను శామ్ సంగ్ ఈ ఫోన్లో వినియోగించినట్టు సమాచారం. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ తో వచ్చే దీని ధర సుమారు రూ.12,000.

More Telugu News