Congress: ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌... రేపు మ‌ళ్లీ రావాలంటూ స‌మ‌న్లు

  • నాలుగో రోజు 10 గంట‌ల పాటు రాహుల్ విచార‌ణ‌
  • 4 రోజుల్లో దాదాపుగా 40 గంట‌ల పాటు రాహుల్‌పై ఈడీ ప్ర‌శ్నల వ‌ర్షం
  • మంగ‌ళ‌వారం కూడా విచార‌ణ‌కు రావాలంటూ రాహుల్‌కు ఈడీ స‌మ‌న్లు
ed officers issued summons to rahul gandhi to attend enquiry on tuesday also

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు వ‌రుస‌గా మంగ‌ళ‌వారం ఐదో రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యంలో విచార‌ణకు హాజ‌రైన రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

గ‌త వారం 3 రోజుల పాటు త‌మ ముందు విచార‌ణ‌కు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపుగా 30 గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. తాజాగా సోమ‌వారం నాటి విచార‌ణ‌లో కూడా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపుగా 10 గంట‌ల పాటు విచారించారు. వెర‌సి 4 రోజుల విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు రాహుల్‌ను 40 గంట‌ల పాటు విచారించిన‌ట్టయింది. నాలుగో రోజు విచార‌ణ ముగింపు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం కూడా విచార‌ణ‌కు రావాల్సిందేన‌ని రాహుల్‌కు ఈడీ అధికారులు స‌మ‌న్లు జారీ చేశారు.

More Telugu News