Indian Army: ఆర్మీ 'అగ్నివీర్' నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. రేపు నేవీ, 24న‌ ఎయిర్‌ఫోర్స్‌ నోటిఫికేష‌న్లు

indian army releases agniveer notification
షార్ట్స్‌లో చూడండి
అగ్నిప‌థ్ ప‌థ‌కంపై కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం కీల‌క అడుగు వేసింది. ఆర్మీ విభాగంలో ఈ ప‌థ‌కం కింద అగ్నివీర్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అంతేకాకుండా నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ తేదీల‌ను కూడా ప్ర‌క‌టించేసింది. వెర‌సి అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఓ వైపు నిర‌స‌న‌లు మిన్నంటుతున్నా... కేంద్రం మాత్రం ఈ ప‌థ‌కం కింద నియామ‌కాల‌కు కీల‌క‌ ముంద‌డుగు వేసింది.

భార‌త సైన్యంలోని నావికా ద‌ళంలో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే స‌మ‌యంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం ఈ నెల 24న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. వెర‌సి అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద అగ్నివీర్‌ల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచే ప్రారంభించిన‌ట్టయింది.
Go Back to Shorts
Indian Army
Indian Navy
Indian Airforce
Agnipath Scheme
Agniveer

More Telugu News