West Bengal: శ్రీకాకుళం జిల్లాలో బోల్తాపడిన పశ్చిమ బెంగాల్ టూరిస్టు బస్సు.. నలుగురి పరిస్థితి విషమం

Tourists bus met with Accident in Srikakulam dist 22 injured
  • పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వెళ్తున్న పర్యాటకులు
  • నిద్రమత్తులోకి జారుకుని కల్వర్టును ఢీకొట్టిన డ్రైవర్
  • ప్రమాద సమయంలో బస్సులో 39 మంది
  • తీవ్రంగా గాయపడిన నలుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్యాటకులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కేరళ బయలుదేరారు. బస్సు గత అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని పెద్దతామరాపల్లికి చేరుకుంది. ఆ సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. 

దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 39 మంది ఉన్నారు. క్షతగాత్రులను టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని శ్రీకాకుళంలోని రిమ్స్‌లో జాయిన్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
West Bengal
Kerala
Srikakulam
Road Accident

More Telugu News