తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి
- ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న భుయాన్
- సీనియారిటీ ప్రకారం రెండోస్థానం
- పదోన్నతి కల్పించాలన్న సుప్రీం కొలీజియం
- రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్రం గెజిట్ విడుదల
ఉజ్జల్ భుయాన్ ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ ప్రకారం రెండో స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పించాలన్న సుప్రీంకోర్టు కొలీజయం సిఫారసుల మేరకు ఈ నియామకం చేపట్టారు. దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయగా, కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.