Team India: ఆఖరి టీ20లోనూ టాస్ దక్షిణాఫ్రికాదే... సిరీస్ కోసం ఉరకలేస్తున్న టీమిండియా

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య 5 మ్యాచ్ ల సిరీస్
  • నేడు బెంగళూరులో ఆఖరి టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు
  • టీమిండియాకు మొదటి బ్యాటింగ్
South Africa won the toss in Bengaluru

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సిరీస్ విజేతను తేల్చే నిర్ణాయక టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఐదు టీ20 మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇరుజట్లు 2-2తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ తప్పదనిపిస్తోంది. 

ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లను గెలిచిన సఫారీలు అదే ఊపులో సిరీస్ చేజిక్కించుకుంటారని అందరూ భావించారు. అయితే, టీమిండియా ఆటగాళ్లు పోరాట పటిమ కనబర్చి వరుసగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గి సిరీస్ ను సమం చేశారు. దాంతో బెంగళూరులో జరిగే మ్యాచ్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

గాయం కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. అతడి బదులు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ నాయకత్వం వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టులోకి ట్రిస్టాన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్, రబాడా పునరాగమనం చేశారు. బవుమాతో పాటు మార్కో జాన్సెన్, షంసీలకు స్థానం దక్కలేదు. టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. టీమిండియాలో పంత్ ఫామ్ లేకపోవడం ఒక్కటే ఆందోళన కలిగించే అంశం.

  • Loading...

More Telugu News