Ex PAK bowler: రిషబ్ పంత్ అధిక బరువుపై పాకిస్థానీ మాజీ క్రికెటర్ కామెంట్

  • వికెట్ల వెనుక వేగంగా కదల్లేకపోతున్నాడు
  • కాళ్లపై చతికిలపడి కూర్చోలేకపోతున్నాడన్న కనేరియా
  • అధిక బరువు సమస్య అయి ఉండొచ్చని సందేహం
Rishabh is overweight Being bulky doesnt give him much time Ex PAK bowler questions Pants fitness after flop show

దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టు కెప్టెన్ గా ఊహించని విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పంత్ లోగడ ప్రకటించాడు. కానీ, బ్యాటింగ్ లో అతడు విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ వైపు కూడా అంత చురుగ్గా ఏమీ లేడు. వికెట్ల వెనుక బంతిని దొరకబుచ్చుకునేందుకు అతడు నానా పాట్లు పడుతున్నాడు. 

దీంతో పంత్ పనితీరుపై పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా స్పందించాడు.  వికెట్ కీపింగ్ లోని లోపాలను ప్రస్తావించాడు. అధిక బరువు వల్ల వికెట్ల వెనుక పంత్ పెద్దగా వంగి ఉండలేకపోతున్నట్టు చెప్పాడు. 

‘‘పంత్ వికెట్ కీపింగ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఒకటి గుర్తించాను. ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేస్తున్న సందర్భాల్లో పంత్ చతికిలపడి పాదాలను వంచి కూర్చోలేకపోతున్నాడు. అతడు అధిక బరువుతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అంత బల్కీగా ఉండడంతో వేగంగా స్పందించలేకపోతున్నాడు. ఇది అతడి ఫిట్ నెస్ పై ఆందోళనలు కలిగిస్తోంది. అతడు 100 శాతం ఫిట్ గా ఉన్నాడా? 

కానీ పంత్ కెప్టెన్సీ విషయానికి వచ్చే సరికి అతడికి పాండ్యా, కార్తీక్ సహా అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను గెలిచిన తొలి కెప్టెన్ గా గుర్తింపు పొందే అవకాశం రిషబ్ పంత్ ముందు ఉంది’’అని కనేరియా వివరించాడు. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసిన దినేష్ కార్తికేయను కనేరియా మెచ్చుకున్నాడు.

More Telugu News