Chandrababu: రోడ్డు ప్రమాద బాధితులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించిన చంద్రబాబు

Chandrababu helps accident victims
  • నిన్న రాత్రి చీపురుపల్లి రోడ్ షో ముగించుకుని వస్తుండగా ఘటన
  • కాన్వాయ్ దిగి క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు
  • తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించిన వైనం
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రేయవలస జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఈ సన్నివేశం చోటు చేసుకుంది. రాత్రి చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకుని వస్తున్న చంద్రబాబు గాయపడిన వారిని చూసి... తన వాహనం దిగి క్షతగాత్రులకు సహాయక చర్యలను చేపట్టారు. తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్సులో విజయనగరానికి తరలించారు. 

ప్రమాదం వివరాల్లోకి వెళ్తే... ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వెళ్తూ ముందున్న రిక్షాను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు 108కి ఫోన్ చేసినప్పటికీ అంబులెన్స్ రావడం ఆలస్యమయింది. ఇదే సమయంలో ఆ మార్గంలో విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ నుంచి కిందకు దిగి క్షతగాత్రులను తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ద్వారా విజయనగరం తరలించారు.
Chandrababu
Telugudesam

More Telugu News