Husband: పెళ్లయిన నెలకే నాలుగు నెలల గర్భవతి.. పోలీసులను ఆశ్రయించిన భర్త!

wife is four months pregnant after one month marriage
  • నెల క్రితం జరిగిన పెళ్లి
  • కడుపునొప్పితో ఆసుపత్రికి 
  • 4 నెలల గర్భవతిగా తేల్చిన వైద్యులు
  • షాక్ కు గురైన భర్త
పెళ్లయిన నెల రోజులకే తన భార్యకు నాలుగో నెల అని తెలిస్తే... ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నెల క్రితం ఒక జంటకు పెళ్లయింది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే ఇటీవల నవ వధువుకు కడుపులో నొప్పిగా ఉండటంతో భర్త కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని, ఆమెకు నాలుగో నెల అని నిర్ధారించారు. దీంతో, వారంతా షాక్ కు గురయ్యారు. ఆమెపై మండిపడ్డారు. తమను మోసం చేశారంటూ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Husband
Wife
Pregnant

More Telugu News