Rajanikanth: రజనీ 169వ సినిమా టైటిల్ ఇదే!

  • రజనీ 169వ సినిమాకి సన్నాహాలు 
  • కొంతసేవటి క్రితమే టైటిల్ రివీల్ 
  • 'జైలర్' టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్  
Rajani 169 movie update

రజినీకాంత్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 169వ సినిమా. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమాకి 'బాస్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఆ పుకార్లకు తెరదించేస్తూ మేకర్స్ అసలు టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకి 'జైలర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రక్తసిక్తమైన వ్రేలాడ దీసిన కత్తిని పోస్టర్ లో చూపించారు. దీనిని బట్టే ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

ఈ మధ్య కాలంలో రజనీ సినిమా .. సినిమాకి తప్పనిసరిగా లుక్ మార్చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఆయనను నెల్సన్ మరింత స్టైలీష్ గా చూపించనున్నాడని సమాచారం. కథానాయికగా ఐశ్వర్యరాయ్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.

More Telugu News