Vijayawada: సికింద్రాబాద్ లో అల్లర్ల నేపథ్యంలో.. విజయవాడ రైల్వే స్టేషన్ లో హై అలర్ట్!

High Alert in Vijayawada railway station
  • అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు
  • సికింద్రాబాద్ స్టేషన్లో మూడు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
  • ఏపీలో ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ కార్యక్రమానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు మూడు రైళ్లకు నిప్పుపెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఆపేశారు. నాంపల్లి స్టేషన్ ను మూసివేశారు. 

ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు భద్రతను రప్పించారు. రైల్వే స్టేషన్ల పరిధిలో జనాలు గుమికూడకుండా చర్యలు చేపట్టారు.
Vijayawada
Railway Station
Security

More Telugu News