Andhra Pradesh: కోనసీమ జిల్లా ఎస్పీతో పాటు మరో నలుగురు ఐపీఎస్ ల బదిలీ!

5 IPS officers transferred in AP
  • ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం
  • కోనసీమ జిల్లా కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి
  • విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా విశాల్ గున్నీ
ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. అమలాపురంలో చెలరేగిన హింసను ముందుగా గుర్తించలేకపోవడంతో ఆయనపై బదిలీ వేటు వేసింది. మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్ గా ఆయనను నియమించింది. 

కొనసీమ జిల్లా కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా విశాల్ గున్నీ, కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ లను నియమించింది.
Andhra Pradesh
IPS Officers
Transfer

More Telugu News