Adhire Abhi: 'జబర్దస్త్' నటుడు అదిరే అభికి ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స!

Jabardasth comedian Adhire Abhi meets with accident
  • షూటింగ్ సందర్భంగా ప్రమాదం
  • చేతికి 15 కుట్లు పడిన వైనం
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
టాలీవుడ్ నటుడు, ప్రముఖ టీవీ షో 'జబర్దస్త్' కమెడియన్ అదిరే అభి (అభినయ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యాడు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన చేతికి 15 కుట్లు పడ్డాయి. ఆయన కాళ్లకు కూడా గాయాలయ్యాయి. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. 

మరోవైపు అదిరే అభి కెరీర్ విషయానికి వస్తే... కొన్ని నెలల క్రితం ఆయన జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాడు. మా టీవీలో ప్రసారమవుతున్న 'కామెడీ స్టార్స్'లో చేశాడు. ఆ తర్వాత టీవీ షోలకు దూరంగా ఉంటూ... సినిమాల్లో బిజీగా మారాడు. ఈ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగింది.
Adhire Abhi
Jabardasth
Accident
Tollywood

More Telugu News