Ranbir Kapor: ఈ ప్రపంచంలో ఏదో జరుగుతోంది .. 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్ రిలీజ్

  • భారీ బడ్జెట్ తో రూపొందిన 'బ్రహ్మాస్త్ర'
  • రణబీర్ కపూర్ జోడీగా అలియా భట్ 
  • తెలుగు టైటిల్ గా 'బ్రహ్మాస్త్రం'
  •  చిరూ వాయిస్ తో వదిలిన ట్రైలర్ 
  • సెప్టెంబర్ 9వ తేదీన 5 భాషల్లో సినిమా విడుదల
Brahmastram trailer released

బాలీవుడ్ ప్రేక్షకులంతా ఇప్పుడు ఒక భారీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు .. ఆ సినిమా పేరే 'బ్రహ్మాస్త్ర'.  మూడు భారీ నిర్మాణ సంస్థలు కలిసి వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మొదటి భాగాన్ని విడుదలకి రెడీ చేస్తున్నారు. 

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ .. అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో అమితాబ్ .. నాగ్ .. మౌనీ రాయ్ కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. 

తెలుగులో ఈ సినిమాను 'బ్రహ్మాస్త్రం' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ వర్క్ ఒక రేంజ్ లో కనిపిస్తోంది. బ్రహ్మాస్త్రంతో ముడిపడిన ఒక యువకుడి కథ ఇది.

More Telugu News