Pakistan: రాయితీలను ఎత్తివేయకపోతే పాకిస్థాన్ మరో శ్రీలంక అవుతుంది: పాక్ ఆర్థిక మంత్రి ఆందోళన

  • తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
  • భారీ రాయితీలతో ఆర్థిక నష్టాలు
  • అదే బాటలో పాక్.. రాయితీలపై సమీక్ష
  • కఠిన నిర్ణయాలు తప్పవన్న పాక్ ఆర్థికమంత్రి
Pakistan finance minister Miftah Ismail opines on country present financial situation

వరుసగా రెండు సంవత్సరాలు కరోనా సృష్టించిన సంక్షోభం ఓవైపు, భారీ రాయితీలు మరోవైపు శ్రీలంకను దివాలా దిశగా నడిపించిన  సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ పరిస్థితి కూడా అలాగే ఉందని పాకిస్థాన్ ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలు గుదిబండల్లా మారాయని, ఈ రాయితీలను ఎత్తివేయకపోతే పాకిస్థాన్ కూడా పెను సంక్షోభంలో కూరుకుపోతుందని అన్నారు. 

కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తాము లీటర్ పెట్రోల్ పై రూ.19, డీజిల్ పై రూ.53 మేర రాయితీ ఇస్తున్నామని, శ్రీలంకలోనూ ఇలాగే రాయితీలు ఇచ్చి దివాలా తీశారని, ఇప్పుడు తమ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని షాబాజ్ షరీఫ్ కు నివేదించామని మిఫ్తా ఇస్మాయిల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీ విషయంలో ప్రధాని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. 

ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) సైతం పెట్రోలియంపై రాయితీలు ఎత్తివేయాలని సిఫారసు చేస్తోందని తెలిపారు. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీల పెంపు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పాక్ ఆర్థికమంత్రి వెల్లడించారు.

More Telugu News