Nara Lokesh: దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ పాలాభిషేకం చేయించారు: నారా లోకేశ్

Lokesh slams CM Jagan over dalit youth murder
  • ఇందుకూరు పేటలో ఊరేగింపు చేశారన్న లోకేశ్
  • అనంతబాబును హీరోగా కీర్తిస్తున్నారని ఆగ్రహం
  • జగన్ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని వ్యాఖ్య  
దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను అతికిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును హీరోగా కీర్తిస్తూ దేవీపట్నటం మండలం ఇందుకూరుపేటలో వైసీపీ ఊరేగింపు నిర్వహించిందని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ విమర్శించారు. దళిత యువకుడ్ని చంపిన అనంతబాబుకు జగన్ పాలాభిషేకం చేయించారని మండిపడ్డారు. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై దమనకాండ అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు స్పష్టమవుతోందని తెలిపారు. 

ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకే శిక్షేనని మరోసారి రుజువైందని లోకేశ్ పేర్కొన్నారు. దళితులను దారుణంగా చంపేవాళ్లకు ప్రమోషన్లే తప్ప, సస్పెన్షన్లు ఉండవని జగన్ లీడర్ల నుంచి క్యాడర్ వరకు భరోసా ఇస్తున్నారని విమర్శించారు.
Nara Lokesh
Jagan
Aanatababu
Dalit
Murder

More Telugu News